బస్తీ దవఖానతో ప్రజలకు అందుబాటులోకి వైద్యం **

Published: Monday January 23, 2023
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 20 (ప్రజాపాలన, ప్రతినిధి) :బస్తీ దవఖానతో ప్రజలకు అందుబాటులోకి మెరుగైన వైద్యం రానుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం  జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లొ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్తి దవఖానను అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పెయి, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బస్తీ దవఖాన వల్ల వైద్యం మరింత అందుబాటులోకి రానుందన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ప్రారంభించినట్లు వివరించారు. జిల్లా ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం టి ఆర్ నగర్ లో నిర్మాణం పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైధ్యాధికారి ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్, డిప్యూటీ వైధ్యాధికారి సుధాకర్ నాయక్, వైద్యులు డాక్టర్ సత్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.