ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల నిర్మూలనే లక్ష్యం

Published: Wednesday January 19, 2022
జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఐపీఎస్
వికారాబాద్ బ్యూరో 18 జనవరి ప్రజాపాలన : ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల నిర్మూలనే లక్ష్యంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర డి‌జి‌పి మహేందర్ రెడ్డి సూచించారని జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఐపీఎస్ అన్నారు. మంగళవారం రోడ్ సేఫ్టీ ఆన్లైన్ మీటింగ్ లో జిల్లా ఎస్‌పి నంద్యాల కోటి రెడ్డి పాల్గొన్నారు. ఇట్టి మీటింగ్ లో అత్యధికంగా ఫ్యాటల్ రోడ్ ఆక్సిడెంట్ (ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు) లు జరిిిగే పోలీస్ స్టేషన్ లను గుర్తించి రోడ్ ఆక్సిడెంట్ లు జరుగుటకు గల కారణాలు, తక్షణ నివారణ చర్యల గురించి మాట్లాడటం జరిగింది. జిల్లా నుండి ఎంపికకాబడిన పరిగి పోలీస్ స్టేషన్ గురించి చర్చించడం జరిగింది. పరిగి పోలీస్ స్టేషన్ పరిధి గుండా ఎన్ హెచ్ 163 జాతీయ రహదారి పోతుంది. జాతీయ రహదారి పైన  గుర్తించబడిన “బ్లాక్ స్పాట్స్” (ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యే ప్రాంతాలు) లలో ఏర్పాటు చేయాల్సిన హెచ్చరిక బోర్డ్ లు, చెట్ల పొదల తొలగింపు, రేడియం స్టిక్కర్స్, రేడియం బ్లింకర్స్ లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదలను నివారించవచ్చు. అదేవిధంగా రోడ్డు వెడల్పు చేపట్టడం మరియు డివైడర్ లను ఏర్పాటు చేయడం ద్వారా కమ్యూనిటి పోలిసింగ్ ద్వారా వాహన దారులకు, డ్రైవర్ లకు గ్రామీణ యువతకు రోడ్డు భద్రత విద్య యొక్క అవశ్యకతను, రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన నియమ నిబందనల గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా నందు కళాజాత పోలీస్  బృందం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్‌పి పేర్కొనడం జరిగింది. జిల్లా పోలీస్ అధికారులు రోడ్డు ప్రమాదలను నివారణకు ఇతర అదికారులతో కలిసి పని చేయాలని, తమ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలలో సి‌సి‌టి‌వి లను ఏర్పాటు చేసుకోవాలని మరియు హై వే లలో స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసి అతివేగంగా నిర్లక్ష్యంగా వెళ్ళే వాహనాలపైనా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్‌పి తెలిపినారు.