ఐరిష్ కు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించండి

Published: Wednesday May 05, 2021

రెవెన్యూ అధికారులకు రేషన్ డీలర్లు, కార్డు హోల్డర్ల విజ్ఞప్తి

బెల్లంపల్లి, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రేషన్ కార్డు హోల్డర్లు అయినా వినియోగదారులు సగానికిపైగా ఆధార్ లింకు చేసుకోకపోవడం వల్ల రేషన్ సరుకులు ఇవ్వడం, తీసుకోవడం ఇబ్బందిగా మారిందని రేషన్ డీలర్లు, కార్డు హోల్డర్లు ఐరిష్ కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని రెవెన్యూ అధికారులకు మండల రేషన్ డీలర్లు, కార్డు హోల్డర్ల విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు బెల్లంపల్లి పట్టణం లోని రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు అందరూ మూకుమ్మడిగా రేషన్ ఇవ్వటం నిలిపివేసి వారు నిరసన తెలిపారు. అసలు కరోనా బాధితులు పెరుగుతున్న ఈ తరుణంలో ఐరిష్ ద్వారా రేషన్ ఇవ్వడం అటు వినియోగదారులు ఇటు రేషన్ డీలర్లు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రేషన్ తీసుకోవడానికి వినియోగదారులు ఇవ్వడానికి డీలర్లు భయాందోళనకు గురవుతున్నారని కావున రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఐరిష్ ద్వారా కాకుండా వేరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.