రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం ..బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీ

Published: Tuesday February 07, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 06, ప్రజాపాలన:
 
 రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉంటే  కేవలం రెండు శాతం మాత్రమేనని కేటాయించారని విమర్శించారు, రాష్ట్ర బడ్జెట్ ప్రారంభానికి ముందే బడ్జెట్లో బీసీలకు 20వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ  బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.  ఇది పూర్తిగా బీసీలను వివక్షకు గురి చేయడమే అవుతుందని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక పన్నులు కడుతుంది బీసీలే అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులో అన్యాయం స్పష్టంగా  కనిపిస్తోందని ఆరోపించారు. ఈ బడ్జెట్లో బీసీలకు కేటాయించింది 6229 కోట్లు మాత్రమేనని, రాష్ట్రంలోని బీసీలకు ఈ బడ్జెట్ తో బిస్కెట్లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఈ బడ్జెట్ పై పున సమీక్షించి బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాల ఐక్యవేదికగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలోతెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది రాజలింగు మోతె, ఐక్యవేదిక నాయకులు బలిశెట్టి లక్ష్మణ్, నీలం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.