సారంగాపూర్ మండల్ సర్వసభ్య సమావేశం...

Published: Wednesday November 24, 2021

సారంగాపూర్, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మాండల్ సర్వసభ్య సమావేశం మండల్ పరిషత్ అధ్యక్షురాలు కోల జమున అధ్యక్షతనలో నిర్వహించిన సమావేశంలో మొదటగా వ్యవసాయ శాఖతో మొదలు కాగా ఐకేపీ పై విస్తృతమైన చర్చ జరిగింది. అర్పపల్లి ఎంపీటీసీ సోల్లు సురేందర్ ధాన్యం సెంటర్లలో కాంట కాకపోవడంతో వడ్లను గోదాంలకు తరలించక పోవడంతో ఐకేపీ అధికారిపై తీవ్ర స్థాయిలో ఎంపీటీసీ మండిపడ్డారు. మిషన్ భగీరథ పనుల అంశంలో పైపులు లీకేజీ అయి నీళ్లు పోవడంతో రేచపల్లి ఎంపీటీసీ భూక్య లావణ్య అధికారి దృష్టికి తీసుకురాగా వెంటనే పూడుస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే కోన్నీ అభివృద్ధి పనులు తెలియక పోవడంతో మరియు పశు సంవర్దక శాఖకు సంబంధించిన లోన్స్ లబ్ధిదారులకు జాప్యం కావడంతో పోతారం ఎంపీటీసీ జోగినపల్లి సుధాకర్ రావు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ పంచాయతీ రాజ్ విద్య వైద్యం పౌర సరఫరాలు ఆర్టీసీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సఖీ కేంద్రం నిర్వహించే ఆడవాళ్లుపై అత్యాచారాలు సామాజిక  కార్యక్రమాలపై గ్రామ సభలపై సర్పంచులు సహకరించాలని సఖీ అధికారులు కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వాసల వెంకటేశం డిప్యూటీ తహశీల్దార్ సందీఫ్ ఎంపీవో శశికుమార్ రెడ్డి మెడికల్ అధికారి మైత్రిరాణి ఏఓ తిరుపతి నాయక్ జమున దేవి సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి కొండ శ్రీలత పంపర్తి లక్ష్మీ వెంకటరమణ ఎంపీటీసీ పాలేపు విమల మానాల ప్రసన్నమాల ఏఈలు వసీం రవి నాయక్ భూపతి ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి మండల అధికారులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.