ప్రభుత్వాసుపత్రి రక్తదాన శిబిరంలో 75 మంది దాతలు పాల్గొనడం సంతోషం..*డిప్యూటీ డిఎంహేచ్ఓ నాగజ్య

Published: Thursday August 18, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి 

నియోజవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  ఆజాధిక అమృత మహోత్సవ్ 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం రక్త శిబిరాన్ని ఎంపీపీ కృపెష్ ప్రారంభించారు . ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో నాగజ్యోతి మాట్లాడుతూ  ఈ రక్తదాన శిబిరంలో అనేకమంది గురునానక్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు యువకులు పాల్గొన్నారని, మొత్తంగా 75 మంది రక్తదానం చేయడం సంతోషంగా ఉందని, రక్తదానం చేయడం ఒక ప్రాణాన్ని కాపాడమని,ఇంకా అనేకమార్లు రక్తదానం చేయడం వల్ల  ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, స్థానిక మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, ఎంపీటీసీలు మండల ప్రాదేశిక చర్ల పటేల్ కూడా సర్పంచ్ గీతా రామ్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కంబాలపల్లి భరత్ కుమార్, అభివృద్ధి అధికారులు, మండల పీహెచ్ సి వైద్యాధికారులు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.