ఈ నెల 27న మస్కు నరసింహ ప్రథమ వర్ధంతి

Published: Friday July 23, 2021
శాస్త్ర గార్డెన్ కు సిపిఎంనాయకులు వేలాదిగా తరలి రావాలని పిలుపు
ఇబ్రహీంపట్నం, జులై 22 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లోని చింతుల్ల, గ్రామంలో పుట్టి పెరిగి విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేసి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గా పనిచేసి అంచెలంచెలు గా ఉద్యమాల్లో ముందడుగు వేస్తు భూమికోసం, భక్తి కోసం, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి కోసం ఎర్రజెండా వైపు మళ్లించి ఎన్నో సేవలు చేసిన కామ్రేడ్ మస్క్ నరసింహ్మ చేశారని సిపిఎం జిల్లా నాయకులు బొడ సామేల్, మండల కార్యదర్శి చేతల జంగయ్య ఆయన సేవలనుకొనియాడారు. అదే కాకుండా  ఫోర్ లైన్ రోడ్డు యచారం నుంచి హైదరాబాద్ వరకు కావాలంటూ పాదయాత్ర చేసి సాధించిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఆనాటి రోజుల్లో కృష్ణ జలాల కోసం పోరు సలిపిన వీరుడని, ప్రతి ఒక్క కార్యకర్త కామ్రేడ్ మస్కు నరసింహ ఆశయ సాధనకు పనిచేయాలని అని ఆయన కోరారు. కామ్రేడ్ మస్కు నరసింహ ప్రధమ వర్ధంతి 27వ తేదీ ఇబ్రహీంపట్నం శాస్త్ర గార్డెన్స్లో జరుగుతున్నందున భారీగా సిపిఎం నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎర్రదండుతో నాట్య మండలి కళారూపాలతో కదలిరావాలని సామేలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి  గడ్డం గణేష్, సి ఐ టి యు బుగ్గ రాములు, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.