సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే : సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్

Published: Wednesday September 15, 2021
మధిర, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదేనని, కమ్యూనిస్టుల పోరాటాలతోనే తెలంగాణకు విముక్తి లభించునని సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు.సాయుధ పోరాట యోధుడు వాసిరెడ్డి వెంకట పతి స్మారక స్థూపం వద్ద 74వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలు సీపీఐ మధిర మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభకు సీపీఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు అధ్యక్షత వహించగా నేతలు వాసిరెడ్డి వెంకటపతికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోటు ప్రసాద్ మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతరేకంగా రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్వహించిందని, ఈ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి వుట్ల కొండలరావు, చింతకాని మండల కార్యదర్శి మల్లికార్జున, జిల్లా సమితి సభ్యులు పెరుమలపల్లి ప్రకాశరావు, మండల సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ, చెరుకూరి వెంకటేశ్వర్లు, మచ్చ వెంకటేశ్వర్లు, మంగళగిరి రామాంజనేయులు, అన్నవరపు  సత్యనారాయణ, నాగ కృష్ణ, శిలివేరు శీను, జిల్లా బ్రహ్మం, ఎస్ కే కొండ, కోటమ్మ, తలారి రమేష్, కొండూరు నాగేశ్వరరావు, పంగ  శేషగిరి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.