అంబలాపూర్ లో మండల వ్యవసాయాయ అధికారి వరిపంటల క్షేత్రస్థాయి పరిశీలన శంకరపట్నం జనవరి 03 ప్రజాప

Published: Thursday January 05, 2023

శంకరపట్నం మండలం అంబాలపురు గ్రామంలో మంగళవారం గ్రామంలోని వరి పంటలను మండల వ్యవసాయ అధికారి ఆర్. శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట పొలాల్లో ఎక్కువగా మోగిపురుగు,జింక్ లోపాన్ని గుర్తించారు.  మోగిపురుగు నివారణకు నాటు వేసిన 15 రోజుల తర్వాత తప్పనిసరిగా కార్పస్ హైడ్రోక్లోరైడ్ 4g గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున చల్లుకోవాలని సూచించారు. జింక్ లోప నివారిన కోసం లీడర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ను కలుపుకొని వారం రోజులు రెండుసార్లు పిచికారి చేయాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ బి.శైలజ, రైతుబంధు సమితి కోఆర్డినేటర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.