ఎన్ ఆర్ ఐ సెల్ ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

Published: Monday July 12, 2021
కొడిమ్యాల, జూలై 11 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్  జన్మదినోత్సవాన్ని  కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంజయన్న ఇలాంటి ఎన్నో పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవాలని వీరి నాయకత్వంలో 2023 లో భాజాపా ప్రభుత్వం ఏర్పాడలని తెలిపారు. ఈ వేడుకల్లో నరేష్ పంచిత, శేఖర్, మహేష్, శివప్రసాద్ నారాయణ పాల్గొన్నారు.