ప్రభుత్వ జూనియర్ కళాశాల కు 60 బెంచ్ లను వితరణ

Published: Sunday October 10, 2021
మధిర, అక్టోబర్ 09, ప్రజాపాలన ప్రతినిధి : ఏర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల కు 60 బెంచ్ లను వితరణ గా మధిర భరత్ విద్యాసంస్థల అధినేత, రాష్ట్ర వైయస్సార్ టి పి నాయకులు శీలం వెంకట రెడ్డి, విద్యాలత దంపతులు. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రమణారెడ్డి అధ్యక్షతన కళాశాలకు బెంచ్ లను వితరణగా ఇచ్చినటువంటి భరత్ విద్యాసంస్థల అధినేత వెంకట్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ కళాశాలకు బెంచ్ లను ఇచ్చినందుకు గాను వెంకట్ రెడ్డి దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, ఎన్నం సత్యనారాయణరెడ్డి, కళాశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.