*మధిరలో పెట్రేగిపోతున్న హిజ్రాలు

Published: Thursday September 29, 2022
దసరా మామూళ్లు కోసం కోల్డ్ స్టోరేజి యజమానిపై దాడి చేసిన హిజ్రాలు*
*దాడిని ఖండించిన హిజ్రాల సంక్షేమ సంఘం*

మధిర సెప్టెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధిగతంలో పెద్దపెద్ద పట్టణాలకే పరిమితమైన హిజ్రాల దాడులు తాజాగా మధిర పట్టణంలో చోటు చేసుకోవటం పట్టణ ప్రజలను వ్యాపారును భయభ్రాంతులకు గురిచేసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది హిజ్రాలు మధిరకు చేరుకొని డబ్బులు ఇవ్వని వ్యక్తులపై దాడి చేయడం దూషించడం గత కొంతకాలంగా మధిరలో తరచుగా జరుగుతోంది. హిజ్రాల వల్ల రాత్రిపూట గృహాలకు చేరే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వాహనదారులను, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మధిర రైల్వే గేటు వద్ద హిజ్రాలు కాపుగాసి ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులను వెంటపడి వేధించి డబ్బులు ఇచ్చే వరకు వదలడంలేదు. తాజాగా మంగళవారం రాత్రి మధిర పట్టణంలో ఇల్లెందలపాడు సమీపము నందు ఉన్న కోల్డ్ స్టోరేజీ యజమానిపై హిజ్రాలు దసరా మామూలు కోసం దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. దసరా మామూళ్లు కోసం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వద్దకు 25 మంది ఆంధ్రకు చెందిన హిజ్రాలు 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత మామూళ్లు ఇవ్వలేనని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం చెప్పడంతో విచక్షణ కోల్పోయిన 25 మంది హిజ్రాలు   కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై దాడి చేసి విచక్షణారహితంగా గాయపరిచారు.గతంలో మధిర ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగలేదు. ఇప్పటివరకు పట్టణంలో ఎక్కడైనా వివాహం జరిగిన ఓణీలు ఫంక్షన్ జరిగినా హిజ్రాలు ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేయటం జరుగుతుంది. ఎవరైనా డబ్బులు లేవు అంటే అక్కడ హిజ్రాలు పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారు. వీళ్ళతో ఎందుకులే అనుకోని శుభకార్యాలు నిర్వహించేవారు ఎవరికి చెప్పుకోలేక వారు అడిగింది ఇచ్చి పంపిస్తున్నారు. తాజాగా మాముళ్ళు కోసం వచ్చిన హిజ్రాలు ఏకంగా దాడులకు పాల్పడటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు దీనిపై దృష్టి సారించి ఇకమీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుచున్నారు. దీనిపై తెలంగాణ హిజ్రాల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు దోమల మేరి మాట్లాడుతూ మధిరలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది హిజ్రాలు ఇటువంటి సంఘటనకు పాల్పడుతున్నారని, చట్టం ప్రకారం దాడి చేసిన హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సంఘటన సాకుగా చూపించి హిజ్రాలందరిని నేరస్తులుగా చూడవద్దని ఆమె కోరారు.