4న నగర మార్కెట్ లోకి ఛాయిస్ క్యాబ్స్ సర్వేసెస్ ప్రారంభం

Published: Saturday July 03, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : డ్రైవర్లు, వినియోగదారులు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారానికి ఈ నేల4 న ఛాయిస్  క్యాబ్స్ సర్వేసెస్ ను హైదరాబాద్ నగర మార్కేట్ లోకి విడుదల చేస్తున్నట్లు ఛాయిస్ క్యాబ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్స్ సత్యనారాయణ, నిలేష్ లు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పంజాగుట్టలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా ఇతర క్యాబ్ సర్వీసెస్ సంస్థలు అనుసరిస్తున్న విధానాల వల్ల క్యాబ్ డ్రైవర్లు, వినియోగదారులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో తమ సంస్థ క్యాబ్ సర్వీసులను నగర మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. డ్రైవర్ల వద్దనుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా వారి నెల వారి సంపాదన మొత్తం వారికే చెందేలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. డ్రైవర్లు కేవలం ఛాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని  రిజిస్టర్ అయితే చాలు అని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ కు నెలకు ఒకసారి రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయని తెలిపారు. వినియోగదారుల భద్రత, నమ్మకమే తమ లక్ష్యంగా ఈ సర్వీసెస్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.chois.in  వెబ్ సైట్ ను సంప్రదించవలసిందిగా కోరారు.