ఘనంగా సత్యసాయిబాబా 97వ జయంతి వేడుకలు

Published: Thursday November 24, 2022
మేడిపల్లి, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సాయి ప్రేమ జ్యోతి మందిర్ ప్రశాంత్ నగర్ సత్యసాయి సేవా సమితి  ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 97వ జయంతి సందర్భంగా ఓంకారం, సుప్రభాతం, నాగర్ సంకీర్తన, పల్లకి సేవ కార్యక్రమంలో మేయర్  జక్క వెంకట్ రెడ్డి,25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరిి హరిశంకర్ రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్  యంపల్ల అనంత రెడ్డి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్  నరసింహా రావు కన్వీనర్,ఓ.లక్మి. లేడీ కోఆర్డినేటర్,ధర్మ రాజు,గాయం మోహన్ రెడ్డి కాలనీ వాసులు  మరియు భక్తులు పాల్గొన్నారు.