ప్రభుత్వం ఎస్సీ బీసీ మైనార్టీ లకు ఏమి న్యాయం చేయలేదు మండలం వైఎస్ఆర్ టీపి మండల నాయకులు ఇరుగు

Published: Tuesday February 07, 2023

బోనకల్, ఫిబ్రవరి 6 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఏమి న్యాయం చేయలేదని వైయస్సార్ టిపి మండల నాయకులు ఇరుగు జ్ఞానేశ్ అన్నారు. ప్రభుత్వం వారికి ఏమైనా ఇల్లు గాని లోన్లు గాని ఏమన్నా వచ్చినాయా అంటే ఏమీ లేదని విమర్శించారు. మండలంలోని బీసీ కార్పొరేషన్ నుంచి లోన్ పెట్టుకుంటే ఎంతవరకు వారికి ఏమీ డబ్బులు పడ లేదని, బీసీ సంక్షేమానికి 6 వేల 2 వందల 29 కోట్లు కేటాయించామని ప్రభుత్వ విడ్డూరంగా చెబుతుందని అన్నారు.మైనార్టీ సంక్షేమానికి మొన్న లోను గురించి ఆన్లైన్ చేసుకోమని చెప్పినది ఇంతవరకు వారికి కూడా ఏమి న్యాయం చేయలేదని, ఆ లోనులు ఏమయ్యాయో తెలియదని, 2 వేల 200 వందలు కోట్లు కేటాయించారు గాని ఏమి అయినవో తెలియదు.ఎస్సీ కులాలకు 17వేల 700 కోట్లు కేటాయించారు కానీ ఈ రాష్ట్రంలో మధిర నియోజకవర్గం లోని ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2017 18, 19, లోన్లు పెడితే ఇంతవరకు వారికి ఏ సమాధానం లేక ఒకపక్క బ్యాంకుల వైపు ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఎస్సీ బీసీ మైనార్టీలను ఎస్టీలను మేము ఉద్ధరించినామని చెబుతున్నారు. మీరు కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ ప్రజా సంకల్ప పాదయాత్ర పెట్టి ప్రతి గ్రామంలో అయితేనే ప్రతి మండలంలో అయితే నేమి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ మీద పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం షర్మిలమ్మ పాదయాత్రను ఆపి ఎన్నో ఇబ్బందులు గురి చేసినారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో ఏర్పాటు చేసింది కేవలం ఓట్ల కోసమేనని, ప్రతి పేద ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.