వెరువేరు ప్రమాదాల్లో ఇద్దరికీ తీవ్ర గాయాలు శంకరపట్నం జనవరి01 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Monday January 02, 2023

శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన సుద్దాల ప్రశాంత్ శనివారం రాత్రి మెయిన్ రోడ్ నుండి తన ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో కేశవపట్నం చర్చి వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ నుండి జారిపడగా తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేయి విరిగింది. శనివారం అర్ధరాత్రి  కేశవపట్నం గ్రామానికి  చెందిన గూళ్ల సంజీవ్ కేశవపట్నం మెయిన్ రోడ్డు నుంచి ఊరులోకి వెలుతుండగా పెద్దమోరి వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. సంజీవ్ తలకు, తొంటికి తీవ్ర గాయాలయ్యాయి, గ్రామస్థుల ఫోన్ ద్వారా 108 కి ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ కాజా ఖలీల్ ఉల్లాలు వెంటనే స్పందించి క్షతగాత్రులను వేరు వేరు సమయాల్లో అంబులెన్స్ లో ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.