సిరిపురం గ్రామాన్ని క్లస్టర్ గా ఏర్పాటు చేద్దాం

Published: Saturday January 28, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 27 జనవరి ప్రజాపాలన : వీర్లపల్లి సిరిపురం గ్రామాలను కలిపి క్లస్టర్ గా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. కొత్లాపురం గ్రామ క్లస్టర్లో 11 వేల ఎకరాల భూమి ఉన్నందున సిరిపురం గ్రామాన్ని క్లస్టర్ గా చేయడానికి అవకాశాలు పష్కలంగా ఉన్నాయన్నారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ మైసగల్ల మల్లయ్య అధ్యక్షతన మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా గల్లి గల్లి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని పాడు బడ్డ ఇండ్లు, పెంటకుప్పలు, పిచ్చిమొక్కలు తొలగించి, గ్రామాన్ని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు విద్యుత్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు. గ్రామంలోని 2, 3వ వార్డులలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి, ప్రజలకు సరిపడా నీటిని అందించాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంకును నింపినప్పుడల్లా బ్లీచింగ్ పౌడర్ కలపాలని చెప్పారు. మిషన్ భగీరథ లీకేజీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. 
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కార్మికులకు డబ్బులు చెల్లించలేనటువంటి వారికి వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని  వాడుకలో ఉంచాలన్నారు. సిరిపురం గ్రామస్తుడు అనంతయ్య మాట్లాడుతూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నిర్దేశించుకున్న టైం ప్రకారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా హాజరై ప్రజాక్షేత్రంలోని సమస్యలను తెలుసుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే అని కొనియాడారు. మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామం అభివృద్ధి పథంలో ముందు ఉన్నదని సభాముఖంగా చెప్పారు. పత్తి తర్వాత కంది కూరగాయల పంటలను రైతులు ఎక్కువగా పండిస్తారని స్పష్టం చేశారు. ఫార్మేషన్ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ జనాభా పెరగడంతో పంట పొలాలలో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తుండ్రంతో రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరభద్ర ఆలయం వైపు ఎక్కువగా ఇళ్ల నిర్మాణం జరిగినందున మహిళలు బహిరంగ మలమూత్ర విసర్జనకు వెళ్లడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభా దృష్టికి తెచ్చారు. జెడ్పిటిసి మధుకర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని గుర్తు చేశారు. సిరిపురం గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని ప్రజల కోరికను మన్నించి మంజూరు చేయించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. రైతు బంధు పథకం కింద 18 కోట్లు రైతు బీమా పథకం కింద ఒక కోటి రూపాయలు రావడం విశేషమని కొనియాడారు. రైతు వేదికలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. బాత్రూమ్ బిల్లులు రావడం లేదని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే బిల్లు వచ్చే విధంగా కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డ్వాక్రా భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సభ దృష్టికి తెచ్చారు. మహిళలకు బాత్రూమ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేకు సభాముఖంగా ఫిర్యాదు చేశారు. ఏఎన్ఎం తుల్జమ్మ పనితీరు బాగుండడంతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. సిరిపురం గ్రామంలో మే 18 నుండి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నదని ఏఎన్ఎం థుల్జమ్మ తెలిపారు. ఎస్సీ వాడలో తెమడ ( టిబి) పరీక్షకు సహకరించడం లేదని ఏఎన్ఎం తుల్జమ్మ ఫిర్యాదు చేశారు. ముద్ద చర్మ వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించామని పశువుల డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సభాముఖంగా తెలిపారు. సర్వే నంబర్ 461, 462 లలో 35 ఎకరాల భూమిని రైతులు సాగుచేసుకుంటున్నప్పటకీ వారికి ఇంత వరకు పట్టా పాసు పుస్తకాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పల్లె దవాఖాన ఏర్పాటుకు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని అన్నారు. బిపి షుగర్ వ్యాధి గ్రస్థులు సక్రమంగా మందులు వాడకపోతే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. 2 గుంటల భూమి ఉన్న ఎర్రోల్ల సునీత భర్త చనిపోతే ఆమెకు 5 లక్షల రైతు బీమా వచ్చిందన్నారు.
కులాలను మతాలను రాజకీయాలకు అంటించరాదని ఎమ్మెల్యే హితవు పలికారు.
సిరిపురం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే మొదటగా 8 లక్షల రూపాయలు మంజూరు చేయగా గ్రామ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపిపి కోరిక మేరకు మరో 2 లక్షల రూపాయలు మంజూరు చేశారు. సిరిపురం గ్రామానికి మొత్తం 10 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టుటకు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి
ఎంపిటిసి ఎంపిపి బట్టు లలిత రమేష్ 
ఎంఆర్ఓ శ్రీధర్  ఇంచార్జ్ ఎంపిడిఓ మహేష్
వైస్ ఎంపిపి మోహన్ రెడ్డి 5వ వార్డు మెంబర్ అంజయ్య, బుచ్చయ్య చాకలి నర్సిములు పార్వతేశం భూపతి రెడ్డి నారాయణ రెడ్డి మల్ రెడ్డి మడిల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.