దేవరకొండ కోటేశ్వరావు ఆధ్వర్యంలో బాబు జగజ్జివన్ రావు,జయంతి వేడుకలు

Published: Thursday April 06, 2023

ఎర్రుపాలెం, ఏప్రిల్ 5ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో బుధవారం బిజెపి దళిత మోర్చా జిల్లా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరావు ఆధ్వర్యంలో ఘనంగా జగజీవన్ రావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశి ఆయన మాట్లాడుతూ జగజీవన్ రావు దళిత అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని , ఆయన జయంతి వేడుకలు జరపటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మొక్కపాటి శ్రీనివాసరావు ,చంద్రమౌళి గోపాల్ రావు, రాము గౌడ్ ,రామకృష్ణ ,సామేలు ,మోహన్ రావు వెంకటేశ్వరావు ,ఈశ్వరయ్య ,గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.