ఆదివాసీ గిరిజనుల జోలికి వస్తే సహించేది లేదు

Published: Wednesday April 28, 2021
భద్రాద్రి, కొత్తగూడెం, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : కొత్తగూడెం గ్రామకంఠం భూమిలో గుడిసెలు వేసిన ఆదివాసీ గిరిజనుల జోలికి వస్తే సహించేది లేదు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ సుజాతనగర్ మండలం పాత అంజనాపురం గ్రామంలో 250 మంది ఆదివాసీ గిరిజనులు మంగళవారం  పాత అంజనాపురం గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూమిలో గుడిసెలు వేసారు విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ప్రదేశానికి చేరుకోగా గిరిజనులు వారిని నిలదీయడంతో వెంటనే అట్టి భూమిని 28.4.2021 న సమగ్రంగా సర్వే జరిపి ప్రభుత్వ భూమిగా గుర్తిస్తామని అర్హులైన పేదలకు పంచుతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జాటోత్ కృష్ణ సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్ పాల్గొని మాట్లాడు 1/ 70 లో ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు గ్రామ కంఠం భూములు ఆదివాసి గిరిజనులకు చెందాల్సింది పోయి కొంతమంది గిరిజనేతర పెత్తందారులు చట్టానికి విరుద్ధంగా అట్టి భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని వారి పై చీటింగ్ కేసు నమోదు చేయాలని గ్రామ కంఠం ల భూమిని సమగ్ర సర్వే జరిపి ఆదివాసి గిరిజనులకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల ఆదివాసి గిరిజన ప్రజానీకంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల బాట పట్టవలసి వస్తుందని లేకుంటే రెవెన్యూ వ్యవస్థ బాధ్యత వహించాలని హెచ్చరించారు ఆదివాసీ గిరిజనుల పట్ల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అధికారులు గ్రామపంచాయతీ అధికారులు పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారని గత సంవత్సర కాలంగా గిరిజనులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోని అధికారులు గిరిజనేతర పెత్తందార్లు ఫిర్యాదు తో రావడం గిరిజనులు మీద కేసులు పెడతామని బెదిరించడం అప్రజాస్వామిక చర్య అని దీనిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలి అని కోరారు గిరిజన మహిళలపై గిరిజనేతర పెత్తందారులు కొంతమంది చేయి వేసుకొని అసభ్యంగా ప్రవర్తించారని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కాట్రేవుల  తిరుపతిరావు ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు నాగరత్తమ్మ నాగమణి కళావతి స్వరూప  తదితరులు పాల్గొన్నారు