బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలి బిసి సంఘం ఉద్యామ పోరాట సమితి మంచిర్యాల జిల్లా కో- క

Published: Wednesday November 30, 2022

జన్నారం, నవంబర్ 29, ప్రజాపాలన: బీసీలకు చట్టసభలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం ఉధ్యామ పోరాట సమితి మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ ఏ కే నరసింహులు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని విలేకరుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో బీసీల రిజర్వేషన్లపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోరాటం చేసి, బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాడి ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి చట్టసభలో రిజర్వేషన్ల కోసం నడుం బిగించాలని ఆయన కోరారు.  బీసీలు అంతా ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ సంఘం కో కన్వీనర్ కోడూరు చంద్రయ్య, సాంబారి అంజయ్య, చేట్టిపెల్లి గంగయ్య, మామిడి విజయ్,  శ్రీ రాముల గంగాధర్, వేయికండ్ల రవి, కాడార్ల నర్సయ్య  శ్రీపాద రమేష్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.