రంజాన్ లాక్ డౌన్ ను పర్యవేక్షించిన కమిషనర్

Published: Saturday May 15, 2021
బాలపూర్, మే 14, ప్రజాపాలన ప్రతినిధి : రంజాన్ పర్వదినం లాక్ డౌన్ ను పర్యవేక్షించడానికి వచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఐపీఎస్, వనస్థలిపురం ఏసిపి, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సిఐ తో కలిసి పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గం లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో మందమల్లమ్మ చౌరస్తా చెక్ పోస్ట్ ను శుక్రవారం నాడు రాచకొండ కమిషనర్ ఐపీఎస్ మహేష్ భగవత్ సందర్శించడం జరిగింది. కరోనా మహమ్మారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం నిబంధనలలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా జరుగుతుంది అనటానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ ఐపీఎస్ మాట్లాడుతూ.... ప్రజలు ఎవరు అనవసరంగా బయటకు రావద్దని, పోలీసులకు ప్రజలు సహకరించాలని, అదేవిధంగా ప్రజలు వ్యాక్సినేషన్ వేయించుకునే వారు, కరోన టెస్టులకు వెళ్లే వారు, మిగితా ఎమర్జెన్సీ వాళ్లకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రాచకొండ కమిషన్ రేట్ పరిధిలోని లాక్ డౌన్ పకడ్బందీగా జరుగుతుందని అన్నారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లోని మందమల్లమ్మ దగ్గర కూడా చెక్ పోస్ట్ రోజుకు 20 గంటలపాటు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపి పురుషోత్తం రెడ్డి, మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.