ప్రతిపక్ష వాదులమా లేక తీవ్రవాదులమా

Published: Thursday June 10, 2021
కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్
కోరుట్ల, జూన్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల నియోజకవర్గానికి వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను నిర్ధాక్షిణ్యంగా నిర్బంధించి, అక్రమంగా అరెస్టు చేసి సారంగాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం విడ్డూరంగా ఉందని, ఇలా ప్రభుత్వం తప్పులను ఎలుగెత్తి చూపిన ప్రతిపక్షం వారిని అక్రమంగా అరెస్టు చేయడం ముమ్మాటికీ దుర్మార్గపు చర్య అని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆరోపించారు. పోలీసులను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తూ, అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడం లాంటిదే, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకొని, తెలంగాణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆటలు మరి ఎంతో కాలం సాగవు అని హెచ్చరిచారు. సీఎం కేసీఆర్ వారి తనయుడు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో పర్యటిస్తే ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను సూర్యోదయం కంటే ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్టు చేయడం నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, చెన్న విశ్వనాథం, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నయీమ్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఏ ఆర్ అక్బర్, యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెట్ మెల్లి రంజిత్ గుప్త, వాసం అజయ్, అన్వర్ ముహమ్మద్ నసీర్,అవేజ్ లు పాల్గొన్నారు.