ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి *రైతు దీక్ష కు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ తెలం

Published: Monday November 14, 2022
ఆది బట్ల మున్సిపాలిటి పరిధిలోని కొంగర కలాన్ లోని రైతు దీక్ష చేస్తున్న గోపగళ్ళ యాదయ్యకు సంఘీభావం తెలిపిన ఇటికల సుగుణ రెడ్డి,ఉడుగుల భాస్కర్ గౌడ్
ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకులు ఉడుగుల భాస్కర్ గౌడ్ మాట్లాడుతు కొంగర కలాన్ లోని సర్వే నెంబర్ 339లో గోపగళ్ళ యాదయ్యకు 3.12 గుంటల భూమి ఉండెను అందులో నుండి 2 ఎకరాలు అమ్ముకోగా మిగిలిన 1.12 గుంటల భూమి ఉంది.కొంత మంది రియల్ ఎస్టేట్ భూ భకాసురులు యాదయ్య గారి భూమి మీద కన్ను పడి 339 సర్వే నెంబర్  మార్చి వేసి 340,341 సర్వే నెంబర్ లో భూమి  చూపిస్తు యాదయ్య గారి భూమిని  రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు పాలుపడ్డారు కబ్జాకు పాలు పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పైన తగు చర్యలు తీసుకోవాలి.అధికారులు తక్షణమే స్పందించి సర్వే చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఆ వెంచర్ కు హెచ్ యమ్ డిఏ వారు పెర్మిషన్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.యాదయ్యా గారి భూమికి ఆనుకొని ఉన్న కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న సర్వేనెంబర్ 338 లో 20 ఎకరాల భూమి ప్రభుత్వ కొత్త చెరువు ఉంది.అందులో వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారులు 4 ఎకరాల చెరువు భూమి కబ్జాకు పాలుపడ్డారు ఎఫ్ టియల్ దిమ్మెలను కూడా పీకేశారు  ప్రభుత్వ అధికారులైన కలెక్టర్,ఆర్డియో ఎమ్మార్వో ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో  ముందుకు వచ్చి స్పందించి కొత్త చెరువు భూమిని సర్వే చేసి హద్దు రాలు  పాతి చుట్టు ప్రహరి గోడ నిర్మించాలి కొత్త చెరువుని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై కట్టిన చర్యలు తీసుకోవాలి. కొత్త చెరువుని ప్రభుత్వం  చిత్త శుద్ది తో పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున  ఉడుగుల భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకుడు దూసరి వేణు ప్రసాద్ గౌడ్,మండల నాయకులు జశ్వంత్ రెడ్డి,జెర్కోని రమేష్, మహ్మద్,కోటి ఉడుతల నర్సింహ్మా గౌడ్ గోపగల్ల జనార్ధన్ ,గోపగల్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.