కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి ** డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ **

Published: Monday July 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై24(ప్రజాపాలన,
ప్రతినిధి) : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగాన్ని నివారించే విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమై, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందని, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ అనేక రాష్ట్రాలలో రోజురోజుకు తీవ్రంగా నిరుద్యోగం పెరిగిపోతోందని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఉందని, ఉద్యోగం ఉపాధి కల్పించడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఉద్యోగాల మాట పక్కనబెట్టి మత విద్వేషాలను రెచ్చగొడుతూ నిరుద్యోగుల పైన అనేక దాడులు చేస్తోందన్నారు. అందుకే డివైఎఫ్ఐ బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని, రానున్న రోజులలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కనిపించకపోతే, అధిక సంఖ్యలో నిరుద్యోగులతో చలో ఢిల్లీ సెప్టెంబర్ 3న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేబీ జిల్లాలో మారుమూల గ్రామాలలో, రోడ్లు, ఇండ్లు, రహదారులు చెడిపోయాయి, సరైన సహాయక చర్యలు అందించాలని, విద్య వైద్యం పూర్తిస్థాయిలో అందించాలి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుబోర్కుటే శ్యామ్ రావు, గోడిసెల కార్తీక్, రాజ్ కుమార్, టికానంద్, మాలాశ్రీ, పవన్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area