పేద పిల్లలకు చేయూత అభినందనీయం.. పాస్ట్ డిస్త్రిక్ గవర్నర్ కాపా మురళీకృష్ణ

Published: Saturday December 10, 2022
వైరా, డిసెంబర్ 9 (ప్రజాపాలన న్యూస్): వివాహ వార్షికోత్సవాన్ని పేద విద్యార్థుల మధ్య జరుపుకొని, వారికి చేయూతనందించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ అన్నారు.
 తెల్లాకుల  సందీప్ కుమార్, శైలజ  వివాహ వార్షికోత్సవం సందర్భంగా మండలంలోని సోమవారం అంగన్వాడి పాఠశాలకు
ఐరన్  బీరువాను  అ౦ది౦చారు. దీనిని కాపమురళీకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చింతోజు నాగేశ్వరరావు, జోన్ చైర్మన్ లగడపాటి ప్రభాకర్ రావు, నంబూరు మధు రామకృష్ణ, కౌన్సిలర్ పవిత్ర కుమారి, చింతలపూడి వెంకటేశ్వరరావు,  చింతనిప్పు మురళీధర్ రావు, గొల్లపూడి హరినాథ్ బాబు,   వై బుచ్చి రామారావు,  హెచ్ఎం సూర్య ప్రకాశరావు పాల్గొన్నారు.