కాంగ్రెస్ పార్టీ, ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఘనంగా మే డే కార్యక్రమం

Published: Monday May 02, 2022
మధిర మే ఒకటి ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో మధిర పట్టణంలో ఘనంగా మేడే కార్యక్రమం నిర్వహించారు పలు కూడళ్లలో ఐఎన్టియుసి మధిర మండల అధ్యక్షుడు కోరం పల్లి చంటి జెండా ఎగురవేసి కార్మిక శక్తిని చాటారు శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. కాంగ్రెస్ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తో లక్షల మంది ఉపాధి పొందారు.నాటి కాంగ్రెస్ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు నష్టాలతో అల్లాడిపోతుంటే.. కార్మిక లోకం తల్లడిల్లి పోతుంది. కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి నేడు. కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్పూర్తితో పోరాడాలి. అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరిశెట్టి కిషోర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షురాలు కోమాకుల రమా టౌన్ అధ్యక్షురాలు మైలవరపు లక్ష్మి స్వాతి జానకి  స్వాతిఐఎన్టియుసి మండల ప్రధాన కార్యదర్శి కంభంపాటి నాగయ్య సెక్రటరీ తిరునగరి సత్యనారాయణ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలు నాయక్ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్, ఆదిమూలం శ్రీనివాస్, మాగం ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు