సేవకై జీవించు - సేవకై తపించు

Published: Monday February 15, 2021
మధిర, ప్రజా పాలన: మధిర సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత నిరుపేదలకు పర్యావరణ పరిరక్షణ కొరకు సంచులు పంపిణీ కార్యక్రమం ఈరోజు లడక బజారు నందు (రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద) సందులో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు గౌసియా బేగం ఇంటిదగ్గర ఉన్న అత్యంత బీద మహిళలకు భూతాపాన్ని నివారించుటలో భాగంగా, ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ, "ప్రకృతిని కాపాడుకొనుటకు" "మధిర సేవా సమితి ఆధ్వర్యంలో" ముఖ్య అతిథులు హెచ్ పి గ్యాస్ అధినేత "శ్రీమతి దోసపాటి కళ్యాణి" గారి చేతుల మీదుగా గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి కళ్యాణి గారు సేవా సమితి కార్యక్రమాలు అభినందిస్తూ,  మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం నివారించుటలో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యంగా భావిస్తూ, ముఖ్యంగా గృహిణిలు, గుడ్డ సంచులు వాడుకలో తెస్తూ, భావి తరాలకు చక్కటి వాతావరణాన్ని అందించాలని అనే సందేశంతో పట్టణములో నివాసాలకు వచ్చి మీ దగ్గర  పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మరియు  సేవా సమితి చేపట్టే సేవా కార్యక్రమాలకు మా యొక్క ఆర్థిక సహకారం అందిస్తామని వ్యక్తపరిచినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, మాట్లాడుతూ దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి మిర్యాల కాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి యర్రా లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ చారు గుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జంగా నర్సిరెడ్డి పాల్గొన్నారు