విలేకరి ఇంటిముందు ధర్నా చేయడాన్ని ఖండించిన జర్నలిస్టులు. ...జర్నలిస్టుల హక్కులకు భద్రత కల్ప

Published: Thursday June 23, 2022
మంచిర్యాల మున్సిపల్ పట్టణ ప్రగతి  కార్యక్రమానికి సంబంధించి అధికారులు నిర్వహించిన కార్యక్రమం పట్ల పత్రిక విలేఖరి  రాసిన వార్తా కథనాన్ని నిరసిస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సంబంధిత విలేకరి ఇంటిముందు ధర్నా  చెయడాన్ని జిల్లా లోని పత్రిక విలేకరులు తీవ్రంగా ఖండించారు.  జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ వారి హక్కులను కాపాడాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ని విలేకరులు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎఓ కు , డిపిఆర్వో సంపత్ కుమార్ లకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా
మున్సిపల్ కార్మికులు అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ నస్ఫూర్ , క్యాథన్ పెల్లి మున్సిపలిటీ పరిదిలోని జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యాథన్ పెల్లి లో అంబెడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపగా ,  నస్పూర్-  శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఇలాంటి దాడులతో విలేకర్ల గొంతును నొక్క లేరని హెచ్చరించారు, దాడికి బాధ్యులైన వారిపై చర్యలు కోవాలని డిమాండ్ చేశారు.
 
* ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు.
 
వార్తా కథనాన్ని జీర్ణించుకోలేని మున్సిపల్ పాలకవర్గం విలేకరి ఇంటిముందు దర్నాకు కార్మికులను రెచ్చగొట్టి అప్రజాస్వామ్య పద్దతికి పాల్పడాన్ని జర్నలిస్ట్ సంఘాల నేతలు తప్పుబట్టారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చే జర్నలిస్టుల పట్ల జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలను ఖండిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా టిడబ్ల్యూఎప్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ , కార్యదర్శి గోపతి సత్తయ్య లు మాట్లాడుతూ పత్రికలలో వాస్తవాలు రాస్తే  విలేఖరుల ఇండ్లముందు దర్నా చేయడం ఏలాంటి సంప్రదాయాన్ని ప్రోత్సాహిస్తున్నారో మున్సిపల్ అధికారులు చెప్పాలని అన్నారు. పత్రికల్లో వచ్చే వార్తల పట్ల అభ్యంతరాలు ఉంటే అనేక మార్గాల్లో నిరసన తెలపవచ్చు అని, విలేకర్ల పైన ఉద్దేశపూర్వక మైన దౌర్జన్య సంఘటనలు చేపట్టడం అన్యాయమని  ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు మంగపతి చంద్రశేఖర్, చొక్కారపు శ్రీనివాస్, ఎర్రం ప్రభాకర్, డేగ సత్యం, రమేష్ రెడ్డి, నేరెళ్ల రమేష్, కాచం సతీష్, కేశెట్టి వంశీకృష్ణ సీనియర్ జర్నలిస్టులు, కల్లు రాజలింగు, బన్న ఉపేందర్, పెంబట్ల రాము,  సత్యనారాయణ, పూరెల్లలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.