ఉపాధ్యాయుల సమస్యలను దృష్టికి తీసుకు వెళ్తా : లింగాల కమల్ రాజు

Published: Monday January 17, 2022
మధిర జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో టి ఎస్ యు టి ఎఫ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై లింగాల కమల్ రాజు ను కలిసి వినతి పత్రం అందజేసిన ఈ సమస్యలపై సీఎం దృష్టికి తీసుకొని మంత్రిగారి దృష్టికి తీసుకొని పరిష్కరించగలరని ఉపాధ్యాయ సంఘాలు కోరే ప్రభుత్వ ఉత్తర్వులు 317 వలన ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల సమస్యా పరిష్కారంలో జిల్లా మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ గౌ.లింగాల కమల్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ TSUTF మధిర డివిజన్ సీనియర్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మణరావు, నాగూర్ వలి, వీరయ్య, GBMS రాణి ఆధ్వర్యంలో బాధిత ఉపాధ్యాయులు వినతి పత్రం అందించారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికే నా దృష్టికి వచ్చాయని జీవో అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 13 జిల్లాల స్పౌజులను పూర్వపు జిల్లాలో చేర్చడంలో, దూరప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న మహిళా ఉపాధ్యాయులు, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులు.. సంబంధిత విషయాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు నాయకులు, బాధిత ఉపాధ్యాయులు మాట్లాడుతూ పండగ పూట పిల్లలు, కుటుంబాలతో సంతోషంగా ఉండవలసిన ఈ రోజుల్లో తీవ్ర మానసిక వేదనతో  బాధపడుతున్నామని స్థానికత ప్రామాణికంగా చూడాలని, ఉపాధ్యాయుల నుండి వచ్చిన వేలాది అప్పీళ్ళను  పరిష్కరించాలని, భార్య భర్తల ను వారివారి పూర్వపు జిల్లాలకు చేర్చి ఉపాధ్యాయుల్లో నెలకొన్న మానసిక ఆందోళనను పోగొట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో  UTF నాయకులు చిన్ని, కొండలరావు, ఇబ్రహీం, సురేష్, డి.రమేష్, హసీనా బేగం విజయలక్ష్మి, రమాదేవి, హేమలత, రోజి, రమణమ్మ, స్వర్ణ లత, శివపార్వతి, శివరామకృష్ణ, అర్జున్, కె.రమేష్, చాంద్ పాషా, వెంకటరావు, బాబురావు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.