అంతం లేదా? : నీలం పద్మ

Published: Thursday July 08, 2021
ఆలేరు, జులై 6, ప్రజాపాలన ప్రతినిధి : ఇంకా ఎన్నాల్లు ఈ పసి మొగ్గల నులిపివేత?? ప్రతి నిత్యం చిన్నారులపై, మహిళలపై ఏదో ఒక ఆకృత్యం, దుర్ఘటన జరగని చోటులేదు. ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. వీరి ఆగడాలను, ఆటలను కట్టించడానికి నిర్భయ, దిశ... లాంటి ఎన్ని చట్టాలు తెచ్చిన అవి సక్రమంగా అమలు కావడం లేదు. చట్టాలు మాకు చుట్టాలనే రీతిగా రోజు రోజుకు ఆకతాయిలు పెట్రేగి పోతున్నారు. పక్కరాష్ట్రంలో బ్లేడ్ గ్యాంగ్  అరాచకాలు మరవక ముందే మొన్న అడ్డగూడురులో మహిళ లాకప్ డెత్ నిన్న మేడ్చల్ ప్రగతినగర్ లో అంజలి అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెల్లారు. అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆపై అఘాయిత్యానికి పాలుపడినట్టు తెలుస్తున్నది. చిన్నారి ఒంటిపై అనేక గాయాలు చేసి ఆ పరిసర ప్రాంతంలో వదిలి వెల్లడం జరిగింది. ఆ కన్న తల్లి చిన్నారి పరిస్థితిని చూసి గుండెలు బాదుకుంటుంది. ఇలాంటి తల్లుల కన్నీరు మున్నీరై పారుతుతుంటే ప్రతి హృదయం ద్రవించిపోతుంది. టిపిసిసి మెంబర్, యాదాద్రి - భువనగిరి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ మేడ్చల్ లో జరిగిన చిన్నారి సంఘటనపై మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇప్పటికీ మార్పు రాలేదన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు, సంఘటనలు దేశంలో నిత్యం ఎన్నో జరుగుతున్నాయనే విషయాన్ని మొన్ననే  సిటీ పోలీస్ కమీషనర్ ను కలసి వివరించడం జరిగిందన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాలుపడిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.