వికారాబాద్ పట్టణ అభివృద్ధే ప్రథమ లక్ష్యం

Published: Wednesday February 01, 2023
 పార్టీ ప్రతిష్ట కాపాడాలనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే తీసుకున్నాను
* వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజా పాలన : వికారాబాద్ పట్టణ అభివృద్ధే ప్రథమ లక్ష్యంగా కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ వైస్ చైర్ పర్సన్ 
 చిగుళ్లపల్లి మంజుల రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ తన చాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరాలు పట్టణాలు ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ అయిన *బిఆర్ఎస్ పార్టీ* ప్రతిష్ట కాపాడడం కోసం, వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి ఎక్కడ కూడా ఆవకూడదు అనే ప్రధాన ఉద్దేశంతోనే ముందుకు కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. కొందరు తమ స్వలాభం కోసం ఉద్దేశపూర్వకంగా తెరపైకి తీసుకొచ్చిన మున్సిపల్ అవిశ్వాస తీర్మానంపై *కోర్టు స్టే* తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన *తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, *హైకోర్టు అడ్వకేట్ సాత్విక్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా చిగుళ్లపల్లి మంజుల రమేష్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిందని ఇప్పటివరకు నాకు సహకరించిన వైస్ చైర్ పర్సన్ శంషాబాద్ బేగంకు, పార్టీలకు అతీతంగా సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిలర్ కు, కో ఆప్షన్ సభ్యులకు, అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి నేటి వరకు ఎక్కడా కూడా పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఏ ఒక్క పని చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని ఘంటాపథంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2019 మున్సిపల్ యాక్ట్ లో ఉన్న  మూడేళ్ల అవిశ్వాస తీర్మానాన్ని నాలుగేళ్లకు పొడిగిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ద
ధిక్కరించి, మన వికారాబాద్ మున్సిపల్ నుండే  ముందుగా అవిశ్వాసానికి వెళ్లడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఇప్పటి వరకు వికారాబాద్ మున్సిపల్ ను నా శాయశక్తుల అభివృద్ధి చేసుకుంటూ రావడం జరిగింది. భవిష్యత్తులో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని మరింత అభివృద్ధి చేసి వికారాబాద్ పట్టణ ప్రజల ప్రశంసలు పొందుతానని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి ఎక్కడ కూడా ఆగడం లేదని, డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంతో సమస్యలను మరింత తొందరగా పరిష్కరిస్తూ, విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా *చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్* సంతోషం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు చందర్ నాయక్, అనంతలక్ష్మి, మోముల స్వాతి రాజ్ కుమార్ పాల్గొన్నారు.