వర్షితను ఆశీర్వదించిన టిఆర్ఎస్ నాయకులు..

Published: Tuesday June 21, 2022
తల్లాడ, జూన్ 20 (ప్రజాపాలన న్యూస్): 
 తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామానికి చెందిన గణేశుల నరసింహారావు మనవరాలు వర్షిత ఓణీల అలంకరణ వేడుక సోమవారం కల్లూరు ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య హాజరై చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. స్థానిక నేత గణేశుల రవి ఆధ్వర్యంలో నాయకులంతా హాజరై  చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గోవిందు నరసింహారావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకూబ్ పాషా, కోసూరి రామారావు  ఉన్నారు.