ఈ నెల 19న జాబ్ మేళా

Published: Wednesday May 18, 2022
 జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ 
వికారాబాద్ బ్యూరో 17 మే ప్రజాపాలన : 
జిల్లా  ఎంప్లాయిమెంట్  కార్యాలయము, వికారాబాదు నందు ఈనెల 19 న గురువాము నాడు ఉదయము 10:30 గం.లకు " జాబ్ మేళా "  నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము,   ఫ్రభుత్వ    ఐ.టి.ఐ. క్యాంపస్,శుబాష్ నగర్ కాలనీ, వికారాబాదు నందు ఇట్టి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  ఆస్టర్ ఫార్మసీ ప్రైవేటు కంపెనీ నందు 200 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు.
ఫార్మసిస్ట్ / ఫార్మసీ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ ట్రైనీస్ పోస్టులను D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, మరియు 10 వ తరగతి,  ఇంటర్, డిగ్రీ విద్యార్హత గల వారు ఇట్టి జాబ్ మేళాకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రఖ్యాత ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యము  వారు  తమ  పరిశ్రమలకు అవసరమగు  సిబ్బందిని  ఈ జాబ్ మేళా ద్వారా  ఎన్నుకొంటారని తెలిపారు.
 ఇతర వివరములకు  శ్రీ. బాలరాజ్ 8867765908, M మహేష్ 8867765909,  HR మేనేజర్ లను సంప్రదించవచ్చుని సూచించారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొని  ఉద్యోగములు పొందగలరని కోరారు.