కులమతాలకు పండుగలు శాంతియుతంగా జరగాలిని : సీఐ మహేందర్ రెడ్డి

Published: Monday July 19, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన : కుల, మతాలకు అతీతంగా రాబోయే పండుగలు ప్రతి ఒక్కరు శాంతియుతంగా జరుపుకోవాలని మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం నాడు స్టేషన్ పరిధిలోని వివిధ మస్జీద్ కమిటీ వాళ్లతో, దేవాలయల కమిటీ వాళ్లతో, పలు కాలనీ కమిటీ సభ్యులతో రాబోయే కుల  మతాలకు సంబంధించిన పండుగలు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా అన్నదమ్ముల్లా కలిసి జరుపుకోవాలని పలువురితో  మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మీర్ పేట్ సీ.ఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..... రాబోయే బక్రీద్, బోనాల పండుగలను హిందూ, ముస్లిం సంప్రదాయమైన పండుగలు కులామతాలకు అతీతంగా శాంతి యుతంగా జరుపుకోవాలని, కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అలాగే చట్టాన్ని ఎవరు చేతులలోకి తీసుకోకూడదాని, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినపుడు పోలీస్ వారికి సమాచారం అందించాలని, ఏదైనా వాహనంలో పశువుల అక్రమ రవాణా జరిగినపుడు పోలీస్ దృష్టికి తీసుకురావాలని, పండగల తరువాత వ్యర్థ పదార్తలను విధిగా చెత్త డబ్బాలలో వేయడం కోసం ప్రజలల్లో అవగాహనా కల్పించే బాధ్యత ప్రతి సభ్యులపై కూడా వుందిని అన్నారు. కొత్తవ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, పోలీసులు ప్రజలకోసం ఇరవై నాలుగు గంటలు నిర్వీరమంగా పనిచేస్తున్నారు. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో పీ స్ కమిటీ సభ్యులతో పాటు ఎస్సైలు మారయ్య, వెంకట్ రెడ్డి, క్రిష్ణ రెడ్డి, బాధ్య నాయక్, పలువురు ఇతరులు  పాల్గొన్నారు.