రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Friday January 20, 2023

కోరుట్ల, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి):
ప్రజలందరికీ కంటి చూపు సమస్యలను తొలగించుటకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కోరుట్ల పట్టణం లో 3 సెంటర్ లలో  గురువారం రోజున ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  1వ వార్డ్ లో గల జీ.జీ.అర్ గార్డెన్ లో ప్రారంభించారు. అలాగే 2వ వార్డ్ కు సంబందించి బస్తి దవాఖాన లో చైర్ పర్సన్ అన్నం లావణ్య ప్రారంభించారు. 8వ వార్డ్ లో నలంద హై స్కూల్(ఆదర్శ నగర్) లో వైస్ చైర్మన్ గడ్డమిది పవన్  ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం మనిషిలో అత్యంత ముఖ్యమైన అవయవం కంటి చూపు ఈ కంటి చూపు పై ఎంతో మంది నిర్లక్ష్యం వహించి దృష్టి లోపం తో బాధపడుతునన్నారు అలాంటి వారికోసం వారి వద్దకే వెళ్లి కంటి చూపును పరీక్షించి అవసరమైన కళ్లజోళ్లు మరియు మందులను ఉచితంగా పంపిణీ చేయబడునని తెలిపినారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించు కావాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అర్.డి.ఓ వినోద్ కుమార్ , మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమిది పవన్, కమిషనర్  మహమ్మద్ అయాజ్  , డియై ఈ.ఈ అభినయ్ , మేనేజర్ శ్రీనివాస్ , అర్.ఓ తిరుపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ గజనంద్, 1వ వార్డ్ కౌన్సిలర్ సంగ మాలతి, 2వ వార్డ్ కౌన్సిలర్ రేష్మ ఫర్జిన్, 8వ వార్డ్ కౌన్సిలర్ లోకిని వెంకి, మరియు గౌరవ వార్డ్ కౌన్సిలర్స్, పాత్రికేయులు,మెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.