మున్సిపల్ ఆఫీస్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లను పెంచండి, గవర్నమెంట్ ఆదాయాన్ని కాపాడండి

Published: Tuesday January 11, 2022
శేరిలింగంపల్లి ఉద్యమకారులు
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 10) : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలాని చందానగర్ టౌన్ ప్లానింగ్ విషయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యమకారులు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలాని కలిసి చందానగర్ సర్కిల్ లోని టౌన్ ప్లానింగ్ లో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఉద్యమకారులు చందానగర్ సర్కిల్లో టి పి ఎస్ లు ఒక్కరే ఉన్నారు వారికి కూడా పటాన్చెరు ఇంచార్జి ఇచ్చారు మరియు ఏ సి పి ఒక్కరే ఉన్నారు అతనికి కోర్టు పనులు అనుమతులు అని ఎన్నో పనులు ఉన్నాయి అని చెప్తున్నారు. సమస్యలపై చెప్పుకోవడానికి వెళితే ఏదో ఒక పనిలో ఉన్నామని చెబుతున్నారు అయితే సర్కిల్ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అని చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ భూములు విపరీతంగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి పర్యవేక్షణ లోపం చాలా ఉంది అయితే ముఖ్యంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 44 లోని బి కె ఎనీ క్లూ నాగార్జున ఎనీ క్లూ రెడ్డి ఎనీ క్లూ లలో ఎలాంటి అనుమతులు లేకుండా విపరీతంగా అక్రమ కట్టడాలు జరుగుచున్నవి ఇక్కడ దాదాపు 4. 5 నెలల నుండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లు లేకపోవడం వల్ల ఇక్కడ నిర్మాణాలన్నీ చైన్ మెన్ జావిద్ కనుసన్నలలోనే జరుగుతున్నవి కావున వెంటనే తమరు పరిశీలించి చందానగర్ సర్కిల్ లో ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లను ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క చైన్ మెన్ ను ఏర్పాటు చేయగలరని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కరోనా రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ఆర్థికంగా వెసలు పాటు లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కావున అక్రమ కట్టడాలను నిలిపివేసి అనుమతులు ఇచ్చి నిర్మాణాలు కొనసాగించిన చొ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అని నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది నిర్మాణదారులు కూడా ఎలాంటి భయం లేకుండా నిర్మాణాలు చేసుకోవచ్చు ఈరోజు నిర్మాణం డబ్బులు అంతే ఖర్చు అవుతున్నది ఒక నిర్మాణానికి దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ భయం భయం తో నిర్మాణం చేసుకోవాలి అదే 4 నుంచి 5 లక్షలు పెట్టి అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టిన ఎలాంటి భయం లేకుండా నిర్మాణం కొనసాగించవచ్చు ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని జోనల్ కమిషనర్ ప్రియాంక అల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అని ఆమె పరిశీలించి పై అధికారులను సంప్రదించి వెంటనే చర్య తీసుకుంటానని సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు టిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి. గంగారం సంగారెడ్డి. నిమ్మల శేఖర్ గౌడ్. షేక్ జమీర్ పాల్గొన్నారు