గోదావరి నది పరిశీలన ఇబ్రహీంపట్నం

Published: Monday July 11, 2022
జూలై 10( ప్రజా పాలన ప్రతినిధి ): మండలంలోని గత మూడు రోజుల 
 నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తహసీల్దార్ మాహేశ్వర్ మండలంలోని అన్ని గ్రామాలను పర్యవేక్షించారు.గోదావరి నది పరివాహక గ్రామలైన కోమటి కొండాపూర్,ఎర్దండి, మూలరాంపూర్, బర్తిపూర్, వేములకుర్తి గ్రామల్లోని గోదావరిని పరిశీలించారు వర్షాల కారణంగా ఎస్సారెస్పీ  గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున దీని కారణంగా గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున జాలర్లు కానీ , ప్రజలు కానీ ఎవరూ కూడా గోదావరి నది వైపు వెళ్లకూడదని తెలిపారు.అలాగే యామపూర్-ఫకీర్ కొండాపూర్ , కోమటి కొండాపూర్-ఎర్దండి , ఇబ్రహీంపట్నం-వర్షకొండ మధ్యగల లో లెవెల్ వంతెనలను పరిశీలించారు ప్రవాహం ఎక్కువ ఉన్నందున ప్రజలు ఎవరు రోడ్డు గుండా ప్రయాణం చేయరాదని తెలిపారు ప్రజలు ఎవరు శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండకూడదని వర్షాలకు నివాసం ఉన్న ఇండ్లు ఏమైనా కూలుతే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.వర్షానికి యామపూర్ లో రెండు తిమ్మాపూర్ లో రెండు ఇబ్రహీంపట్నం లో  మూడు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
 
 
 
Attachments area