మండల ప్రజలకు కోవిడ్ 19పై అవగాహన. గంజి పల్లి సర్పంచ్ కల్పన వెంకటేష్

Published: Monday April 26, 2021
జిన్నారం, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : మండల ప్రజలకు కోవిడ్ 19 అవగాహన కల్పిస్తున్నట్లు మండల ఎస్ఐ దేవంబోట్ల రాజు మరియు ఏఎస్ఐ సంగయ్య తెలిపారు. ఆదివారం దోమ మండల పరిధిలోనీ గంజి పల్లిగ్రామాoలో పోలీస్ వాహనంపై  మైక్ సెట్టు అమర్చి మాటక, పాటక రూపకంలో గ్రామాల ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కరోనా వ్యాధి వ్యాప్తి రోజు రోజు వృద్ధి చెందుతున్న తరుణంలో గ్రామస్తులు కరోనా వ్యాధిని అడ్డుకట్టవేయడానికి స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. కరోనా మండలంలో చాపకింద నీరుల విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ జీవో-68 నిబంధనల ప్రకారం గ్రామంలోని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని,సామాజిక దూరం పాటించలన్నారు. బహిరంగ ప్రదేశాలలో గాని, పనిచేయుచున్న స్థలంలో గాని, వ్యాపార లావాదేవీల విషయంలో, రవాణా సందర్భంలో పై నియమాలను పాటించాలని తెలిపారు. జీవో-69 నిబంధనల ప్రకారం సభలు, సమావేశలు, ఊరేగింపులు, విందులు చేయరాదన్నారు. నెలలో వచ్చే  పండుగలకు అనుమతి లేదని తెలిపారు.పై నిబంధనలు అమలులో ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రతి ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించి, అత్యవసర పరిస్థితులలో 100 డయల్ ను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమ. పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.