ప్రజానాట్యమండలి శిక్షణ శిబిరం ఏర్పాటు

Published: Wednesday January 12, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మూడో మహాసభలు జనవరి 22 నుండి 25 వరకు జరుగుతున్న సందర్భంగా ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామంలో మహాసభల పాటల శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతోంది ఈ శిక్షణ శిబిరాన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం జె వినోద్ కుమార్, గడ్డం గణేష్ ప్రారంభించారు  వారు మాట్లాడుతూ. ప్రజానాట్యమండలి కల కల కోసం కాదు కళ ప్రజల కోసం అనే నినాదంతో పనిచేస్తూ ప్రజా సమస్యల మీద ప్రజలను ఉద్యమాలవైపు మళ్ళించే విధంగా పాటల రూపంలో కళారూపాలతో   డప్పు వాయిద్యాలతో ప్రజలను కనువిందు చేసి విధంగా సిపిఎం పార్టీ వైపు మళ్ళించే విధంగా ప్రజానాట్యమండలి పనిచేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు అన్నారు భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం కలుగుతుంది ఎన్నో పాటలను అవలీలగా పాడి చూపెట్టి ఘనత ప్రజానాట్యమండలి కళాకారులు ఉందని వారు తెలియజేశారు. తుర్కయంజాల్ లో జరగబోయే సిపిఎం పార్టీ మూడవ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలంటూ లొ భాగంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు ఆయన తెలిపారు ఈ శిక్షణ శిబిరానికి 25 మంది కళాకారులు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వి భూషణ్, కే.జంగయ్య, ఎం.మహేందర్, పి.ధనేశ్వర్, జి.శివ కుమార్, బి.రాజు, జె.మహేందర్, కే.పద్మ, ఏ.గణేష్ పాల్గొనడం జరిగింది.