*అక్రమ అరెస్టులు ప్రజా ఉద్యమాన్ని ఆపలేవు* కౌన్సిలర్ కోన ధనికుమార్*

Published: Tuesday January 03, 2023
మధిర రూరల్ జనవరి 2 (ప్రజాపాలన ప్రతినిధి) అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని పట్టణ కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ కోన ధని కుమార్ విమర్శించారు. తెలంగాణాలో సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్దగల ధర్నా చౌక్ వద్ద ధర్నా కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వెళుతున్న మధిర మండలంలోని సర్పంచులను ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధనికుమార్ మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ సర్పంచులకు రావాల్సిన నిధులను రాకుండా పక్కదారి పట్టించి వారిని వేదనకు గురి చేస్తున్నారని, వారి పర్సనల్ బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేసి బాధిస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామపంచాయతీలో చేసిన పనులకు బిల్లులు రాక ఇంట్లోని బంగారాలు తాకట్టు పెట్టి పనులు చేయించి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. వెంటనే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లకు రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో చిలుకూరు రొంపిమల్ల సర్పంచులు నిడమానూరి వంశీ షేక్ మదర్ సాహెబ్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు షైక్ బాజీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల లాలయ్య మోదుగు బాబు గద్దల విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు