మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

Published: Monday August 22, 2022
 బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నాగరాజు
వికారాబాద్ బ్యూరో 20 ఆగస్టు ప్రజాపాలన : మహిళలు అన్ని రంగాలలో రాణించాలని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నాగరాజు సూచించారు. ఆదివారం బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ వికారాబాద్ కో ఆర్డినేటర్ సత్తయ్య ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ వారి సహకారంతో జిల్లాలోని మహిళలకు ఉచిత శిక్షణ మగ్గం వర్క్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డైరెక్టర్ నాగరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మగ్గం శిక్షకురాలు సంధ్యారాణి 40 రోజుల పాటు శిక్షణార్థులకు శిక్షణ ఇచ్చారని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న70 మంది మహిళలకు డైరెక్టర్ నాగరాజు సర్టిఫికెట్లు అందించారు. ప్రతి మహిళ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలని హితవు పలికారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మగ్గం చేదోడువాదోడుగా నిలుస్తుందన్నారు. స్వయం కృషితో ఆర్థిక ఇబ్బందులను తొలగించవచ్చని వివరించారు. తాను నేర్చుకున్న మగ్గం వర్క్ ద్వారా 10 మందికి ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సత్తయ్య, ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరిబాబు, శిక్షణార్థులు పాల్గొన్నారు.