సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ.... మంత్రి సందేశం

Published: Wednesday September 01, 2021
బాలాపూర్: ఆగస్టు 31, ప్రజాపాలన న్యూస్ (ప్రతినిధి) : నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సందేశం. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో సెప్టెంబర్ 2న తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ జెండా ఆవిష్కరణ మేరకు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు దిశా నిర్దేశం ప్రకారం సెప్టెంబర్ 2తేదీ స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ వారి వారి గ్రామాలలోని ప్రధాన కూడళ్ల, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ఆయా వార్డుల టి.ఆర్.ఎస్. పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వారి వారి వార్డులలోని ప్రధాన కూడళ్లలో అంగ రంగ వైభవంగా టి.ఆర్.ఎస్. పార్టీ జెండా పండుగ జరపవలసినదిగా మంత్రి సబితా అన్నారు.  కావున తామెల్లరూ మన కార్య నిర్వాహక అధ్యక్షుల వారి సూచన మేరకు కొవిడ్ నిబంధనలను తప్పక పాటిస్తూ టి.ఆర్.ఎస్. పార్టీ ప్రాభవాన్ని మరింత బలపరచాలని తద్వారా తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని తెలియచేయడమైనదిని అన్నారు. ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త, ప్రతి మహిళలకు సర్పంచ్, ఉప సర్పంచ్, ఏం.టి.సి, జెడ్ పి టి సి, కౌన్సిలర్, కార్పొరేటర్లు వారి వారి గ్రామాలలో వార్డులలో డివిజన్ లలో  టి.ఆర్.ఎస్. పార్టీ జెండా పండుగ అత్యంత ఘనంగా జరపాలని అలాగే మండల స్థాయిలలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు పార్టీ అధ్యక్షలు, ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మునిసిపల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మహేశ్వరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు సందేశం ఇచ్చారు.