ఉప ఎన్నికలు జరిగితే వికారాబాద్ కు నిధుల వరద

Published: Friday September 17, 2021
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 16 సెప్టెంబర్ ప్రజాపాలన: ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ సీఎం కేసీఆర్ నిధుల వరదను పారిస్తున్నారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఉపేందర్ రెడ్డి కి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలవడమే లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని దెప్పిపొడిచారు. హుజూరాబాద్ నియోజకవర్గం జనరల్ ఆల్ కేటగిరీకి వస్తుందని గుర్తు చేశారు. వికారాబాద్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి దళిత బంధు పథకాన్ని ఈ ప్రాంతంలోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్ తండ్రి లాంటి వారని అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడాలని కోరారు. దళిత బంధు పథకం మాదిరి ఎస్టీ, బిసి, మైనారిటీ, ఓబిసి బంధు పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమాన దృష్టితో పాలించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని కోరారు భారీ వర్షాల కారణంగా నాసిరకమైన రోడ్లు కొట్టుకొని పోయాయి అని విమర్శించారు వాగు దాటే ప్రయత్నంలో గోరయ్య అనే వ్యక్తి మృతి చెందాడని గుర్తుచేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే కు ఎమ్మెల్యే పదవి కావాలో ప్రజల బాగోగులు కావాలో ఏది కావాలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. 17 సెప్టెంబర్ 2021 శుక్రవారం గజ్వేల్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేయడానికి వికారాబాద్ నుండి రామదండులా తరలి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, వికారాబాద్ ఎంపీపీ కామిడి చంద్రకళ, కో ఆప్షన్ మెంబర్ జాఫర్, కమల్ రెడ్డి ఇ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ మహమ్మద్ రహీం, రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, జైదుపల్లి మురళి, రజనీకాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.