కళ్యాణ లక్ష్మి లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి చెక్కులతో పాటు చీరలను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజ

Published: Tuesday March 08, 2022

జగిత్యాల మార్చి, 07 (ప్రజాపాలన ప్రతినిథి): జగిత్యాల పట్టణ 23వ వార్డ్  మరియు జగిత్యాల అర్బన్ మండల ధరూర్ గ్రామానికి చెందిన 16 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 16,01,856 లక్షల విలువగల చేక్కులను తెల్లవారు జామునే ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి చెక్కులతో పాటు చీరలను అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, వారితో సెల్పి దిగినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళ వారోత్సవాల్లో భాగంగా మహిళ బందు కెసిఆర్ కార్యక్రమంలో భాగంగా మహిళల పథకాల పట్ల అవగాహన కల్పించడం, వారి హక్కులు, చట్టాల పై తెలియజేసి చైతన్య పరచడం, వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం, మహిళ సాధికారత ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వారిని గౌరవించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మెన్ దామోదర్ రావు, కౌన్సిలర్ జంబర్తి రాజ్ కుమార్, సర్పంచ్ ప్రభాకర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సురేందర్, ఉప సర్పంచ్ మహేష్, పట్టణ ప్రదాన కార్యదర్శి ఆనంద్ రావు, నాయకులు చందా పృథ్వి, బుచ్చిరాజం, నిరంజన్, శ్రీనివాస్ రావు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.