మాస్టర్ దొడ్డి శ్రీకర్ ను అభినందించిన కార్పొరేషన్ మేయర్

Published: Friday September 03, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 2,ప్రజాపాలన ప్రతినిధి : చిన్నారులు మున్నుందు ఇంకెన్నో విజయాలు సాధించాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బడంగపెట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్ గ్రామానికి చెందిన మాస్టర్ దొడ్డి శ్రీకర్ వైజాగ్ లో జరిగినటువంటి (under) అండర్ వరల్డ్ కప్ 12.2021  ఇండియన్ చోటకన్ కరాటే ఆర్గనైజేషన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ గోల్డ్ మెడల్ ను బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి చేతుల మీదగా అందించి, అదే విధంగా సర్టిఫికెట్ సీల్డ్ ని అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... అతి చిన్న వయసులో అండర్ 12లో గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆనందదాయకమని, చిన్నారులు క్రీడలో పాల్గొన్న వలన మంచి ఆరోగ్యం గా దృఢంగా ఉంటారని అదేవిధంగా జీవితంలో మున్నుందు ఇంకెన్నో విజయాలు సాధించి, కార్పొరేషన్ కు మంచి పేరు తీసుకురావాలని ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చిన్నారులను క్రీడాకారుల్లో ప్రోత్సహించడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ మాజీ కౌన్సిలర్, కంటెస్టెంట్ కార్పొరేటర్ దండు గణేష్, గ్రాండ్ మాస్టర్ నరేందర్, మాస్టర్ శరత్, కుక్కల సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, దశరథ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.