పారిశుద్యం మౌలిక వసతుల కల్పనకు కృషి : మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి

Published: Friday June 18, 2021
కరోనా కష్టకాలంలో కూడ సంక్షేమం అభివృద్ధి
జగిత్యాల, జూన్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్యం మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 58 మంది మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులను శ్రావణి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 2020 -21 సంవత్సరానికి సంబంధించిన నిత్యావసరాలను అందిస్తున్నమని జగిత్యాల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నేటివరకు శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని తెలిపారు. తడి పొడి చెత్త బుట్టలు పంపిణీ ట్రై బిన్స్ ఏర్పాటు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం స్వీపింగ్ మిషన్ చెత్త తరలింపునకు ఆటోలు ట్రాక్టర్స్ జేసిబిలను కొనుగోలు చేశామన్నారు. కరోనా కష్టకాలంలో కూడ అభివృద్ధి సంక్షేమం ఆగకుండ అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. పారిశుద్యం మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని గత పాలనతో పోల్చి చుస్తే పారిశుధ్యం ఏ విధంగా మెరుగైందో ప్రజలు గమనించాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడ పారిశుధ్య కార్మికులు ధైర్యంగా పని చేశారాని చైర్ పర్సన్ శ్రావణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పిట్టా ధర్మరాజు అల్లే గంగసాగర్ మేక పద్మ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులు సానిటరీ ఇన్స్పెక్టర్ జవాన్లు తదితరులు పాల్గొన్నారు.