వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత ఎఫ్ డి ఓ సిరిపురం మాధవరావు

Published: Thursday October 06, 2022
 జన్నారం, అక్టోబర్ 04,  ప్రజాపాలన: మండలంలోని టి డి సి హాల్లో వన్యప్రాణి సప్త కార్యక్రమంలో భాగంగా మండలంలోని విద్యార్థులకు అడవి వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత కు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన ఉపన్యాస పోటీలను ఎఫ్ డి ఓ సిరిపురం మాధవరావు నిర్వహించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల టి డి సి హాల్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అడవిని రక్షించ బాధిత తీసుకొని, వన్యప్రాణులను కాపాడవలసిన బాధ్యత మన అందరిదీ అని ఆయన తెలిపారు. అడవులను జంతువులను మనం కాపాడినప్పుడే మానవ మునగడ సాధ్యమవుతుందని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత పై వ్యాసరచన చిత్రలేఖన ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎఫ్ డి వో మాధవరావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో అఫీజొద్దీన్, ఎన్ సిసి అధికారి కట్ట రాజమౌళి, ఉపాధ్యక్షులు చందులాల్, శ్రీనివాస్, రమేష్, తిరుపతి, ఫారెస్ట్ అధికారులు, డి ఎఫ్ ఆర్ ఓ తిరుపతి, రహీముద్దీన్, అనిల్ కుమార్, కమలాకర్, ఎఫ్ బి వో లు, జన్నారం బాయ్స్ హై స్కూల్, కలమడుగు హై స్కూల్, చింతగూడ హై స్కూల్, స్లేట్ హై స్కూల్, రాఘవేంద్ర లిటిల్ హాండ్స్ హై స్కూల్ ల విద్యార్థులు విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.