"అయ్యప్ప ఆలయంలో జడ్పీ చైర్ పర్సన్" ప్రత్యేక పూజలు, అన్నదానం **

Published: Wednesday December 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిది) : 
 
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో నిర్వహించే మహాపడి పూజలో భాగంగా మంగళవారం ఆలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, సోనేరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాతగా వ్యవహరించిన జడ్పీ చైర్ పర్సన్, ఆసిఫాబాద్ జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, వాంకిడి జెడ్పిటిసి అజయ్ లతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, బిఆర్ఎస్ నాయకులు కోవా సాయినాథ్, ప్రేమ్ కుమార్, రవీందర్, అయ్యప్ప స్వాములు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.