తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్

Published: Tuesday November 23, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : కొనుగోలు కేంద్రాలలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైకరికి కారణం. తరుగు, తాలు పేరుతో మళ్ళీ మిల్లర్లు రైతులను దోపిడి చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణం. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఇబ్రహీంపట్నం సిపిఎం మండల పార్టీ కార్యదర్శి  జంగయ్య అన్నారు. ఈ సందర్బంగా  బొంగులూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో సర్వీస్ రోడ్డు వెంట ఉన్న పొలాల్లోకి వెళ్లి రైతు కళ్లాల్లో సోమవారం నాడు ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోయిన యాసంగి, వానాకాల దాన్యం కొనుగోలులో 500 కోట్లు మిల్లర్ల చేతిలో రైతులకు నష్టం జరిగిందన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి వారికి రోడ్ల మీద కళ్లాల్లో , మార్కెట్ యార్డులో వున్నా కుప్పలు కనపడుతలేవా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక దిక్కు వర్షాలు పడి రైతులు నిత్యం దాన్యం కుప్పల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి దాన్యం తడిసి ముద్దవుతున్నది. మరో దిక్కు కొనుగోలు చేసిన దానికి రైతులకు ట్రాక్ సీట్ ఇవ్వకుండా దాన్యం మిల్లర్ల వద్దకు  వెళ్ళాక మళ్ళీ తరుగు తీస్తున్నారు. అసలు కొనుగోలు కేంద్రంలో తూకం వేసాక తూకం పట్టి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నామని అన్నారు. తూకం వేసాక లారీ రాకపోతే రైతుకు ఏం సంబందం? ప్రభుత్వం తలుచుకుంటే లారీలు పంపడం పెద్ద సమస్యే కాదు. ప్రభుత్వంలో పార్టీ సమావేశాలకు ఎన్ని వాహనాలు అయిన సమకూర్చుతారు దాన్యం తరలించటానికి మాత్రం మనసేందుకు రాదు అని అన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతుకు సంబందం కానీ మిల్లర్లకు రైతుకు ఎందుకు సంబందం పెడుతున్నారు. ధాన్యం మొలకెత్తి  రైతు ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన రోడ్లు నిర్బంధించి ధర్నా, రాస్తారోకో చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు సామేల్, రైతు సంఘం నాయకులు అమన గంటి వెంకటేష్, సిఐటియు బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.