ప్రజాపాలన క్యాలెండర్ ఆవిష్కరణలో తహసీల్దార్ అనిత, ఎంపీడీవో మహేష్ బాబు

Published: Friday January 07, 2022

ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి : గురువారం నాడు మండల రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ కర్ర అనిత మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మహేష్ బాబు ప్రజాపాలన 2022 దైనందిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాబోవు 45 రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. జర్నలిస్టులు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకు వెళుతూ అక్షరాన్ని ఆయుధంగా మార్చి ప్రతిభను కనబరుస్తున్న ప్రజాపాలన దినపత్రిక సేవలను కోనియాడారు. క్యాలెండర్ ఆవిష్కరణలో ఎంపీవో సురేష్ బాబు, ఏపీడి  సత్రియా నాయక్, డిఆర్డిఏ కోర్టు డైరెక్టర్ శ్యామల, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, దండే శ్రీశైలం, నరాల స్వామి, బూడిద జన్మన్ రెడ్డి,ఎండి. షఫీ, ఎన్ను ప్రకాశ్ రెడ్డి, చెరుకూరి మల్లేష్, పసునూరు వెంకటేష్ , పంచాయతీ సెక్రెటరీలు, తహసిల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.